* పల్లె వెలుగుకు రూ.130
* ఎక్స్ ప్రెస్ కు రూ.180
*ప్రకటించిన ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను
గ్రేటర్ న్యూస్, వరంగల్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.భక్తులందరూ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని వారి మొక్కులను సమర్పించుకుంటారు.ఈ సందర్బంగా 2026 సంవత్సరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర జరుగుతున్న సందర్భంగా వరంగల్ రీజన్ భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సులను నవంబర్ 16 వ తేదీ ఆదివారం నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్
విజయ భాను తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా మేడారంకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ మేడారం ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణకై హనుమకొండ బస్టాండ్
లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు ప్రయాణికుల సేవల కొరకు అందుబాటులో ఉంటారన్నారు. అన్ని ఎక్స్ ప్రెస్, పల్లెవేలుగు బస్సులలో మహిళలకు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు.మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని
సురక్షితంగా వారి మొక్కలను తీర్చుకోవాలని సూచించారు. మేడారం జాతరకు హనుమకొండ బస్టాండ్ నుంచి 6.10, 7, 8, 9, 12.10, 13, 13.40, 14.30, 20.20 బయలు దేరనున్నట్లు తెలిపారు. అదే విధంగా మేడారం నుంచి హనుమకొండకు బస్సులు 5.45, 9.45,
10.15, 11.15, 13.10, 16, 17, 17.30, 18 గంటలకు
బయలు దేరుతాయని వెల్లడించారు. పల్లె వెలుగు బస్సు చార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్ ప్రెస్ బస్ చార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110 గా నిర్ణయించినట్లు ఆర్ ఎం విజయ భాను ప్రకటించారు.

