ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా ఇటీవల నూతనంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ,తోట సుధాకర్,సంగోజు రవి, TUWJ-IJU వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన శ్రీరాం రాంచందర్,మట్ట దుర్గాప్రసాద్ లను  గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన శనివారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారిని శాలువాలతో సత్కరించి మెమోంటో లు అందించి ఘనంగా సన్మానించారు. యూనియన్ కు విశేష సేవలందించి నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న నల్లాల బుచ్చిరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్యలు మాట్లాడుతూ యూనియన్ బలోపేతం కోసం పనిచేస్తున్న నేతలకు పదవులు రావటం అభినందనీయమని అన్నారు. ఐజేయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే విరహత్ అలీ, రాంనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో జర్నలిస్టుల అభ్యున్నతి కోసం కోసం పనిచేస్తున్న యూనియన్ TUWJ-IJU మాత్రమేనని అన్నారు. క్లబ్ లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్,ఉపాధ్యక్షుడు కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, జాయింట్ సెక్రెటరీలు వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్థన్,కార్యవర్గ సభ్యులు ఎండీ నయీంపాషా,విజయరాజ్, ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, నేతలు సోమనర్సయ్య, రాజేంద్రప్రసాద్,సంపత్ రావు,పాషా,సిద్దోజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *