గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ఈ నెల 3,4,5 తేదీలలో హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా కళాయజ్ఞ సృష్టికర్త ఏలూరి శేష బ్రహ్మం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్-2025 (ఆర్ట్ ఎగ్జిబిషన్) లో హనుమకొండకు చెందిన ప్రముఖ చిత్రకారిణి, విద్యా కళాశాల అధ్యాపకురాలు, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంజుల సాగంటి కుంచె నుండి ప్రాణం పోసుకున్న చిత్రం ఎంపిక అయింది… “భారత దేశ సంప్రదాయ గృహాలు” అనే ప్రత్యేక అంశం పై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖ ఆర్టీస్టులు పాల్గొనే ఈ ప్రదర్శన కు తన చిత్రం ఎంపిక కావడం గర్వకారణం అని మంజుల సంతోషాన్ని మీడియా తో పంచుకున్నారు… ప్రస్తుతం కాంక్రీటు గోడల్లో ఉంటున్న సమాజానికి ప్రాచీన సంప్రదాయ రీతుల్లో కట్టిన నివాసాలు ఎలా ఉండేవో తెలియజేసే ఈ ప్రదర్శనకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా రానున్నారని అందుబాటులో ఉండి, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అని మంజుల తెలిపారు.

