గ్రేటర్ న్యూస్, హనుమకొండ :కేసీఆర్ పోరాట ఫలితమే నేటి తెలంగాణ స్వరాష్ట్రమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ నెల 29 తేది అనగా శనివారం రోజున నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద నిర్వహించనున్న దీక్షా దీవస్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం నందు 53వ డివిజన్ కార్పొరేటర్ సోదా కిరణ్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ…కేసీఆర్ పోరాట స్ఫూర్తే నేటి తరానికి ఆదర్శనమని 16 ఏండ్ల క్రితం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే పోరు రణ నినాదం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో సాధించారన్నారు.60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ కేసీఆర్ 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు.10 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం జరిగిందని నాటి ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలిపేందుకే దిక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.ఈ నెల 29 తేది శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి , మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్,కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ రావు, బోయినపల్లి రంజిత్ రావు, ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్లు ఉడతల సారంగపాణి, తండమల్ల వేణు, జోరిక రమేష్, డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్ కుమార్, పున్నం చందర్, కొండ శ్రీనివాస్, పులి విక్రమ్, ఖలీల్, దువ్వ కనకరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, నీలం సుహాస్, కోటేశ్వర్ రావు, చిన్న, రంజిత్, సీనియర్ నాయకులు రిజ్వనా మసూద్, నరెడ్ల శ్రీధర్, కొండపాక రఘు, జానకీ రాములు, బుద్దె వెంకన్న, సల్వాజీ రవీందర్ రావు, నయీమొద్దీన్, నార్లగిరి రమేష్, పానుగంటి శ్రీధర్, మూటిక రాజు యాదవ్, అఫ్జల్, నాయకులు తక్కళ్లపల్లి వినీల్ రావు, రవీందర్ రెడ్డి, గొర్రె విజయ్, మిట్టపెల్లి రమేష్, మహేందర్, రమేష్, గుండు శ్రీను, శ్యామ్ రెడ్డి, రాజ్‌కుమార్, అనిల్, బరిగెల వినయ్, ఇస్మాయిల్, పుల్లయ్య, సుమన్, కోండ్ర శంకర్, ప్రసాద్, దేవమ్మ, సారిక, విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్, వీరస్వామి, సందీప్ యాదవ్, పరుశురాం శేఖర్, తదిరతలు పాల్గొన్నారు.


