గ్రేటర్ న్యూస్, వర్దన్నపేట :తెలంగాణ రాష్ట్ర , వర్ధన్నపేట నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. సర్వ మానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ, కరుణ వంటి మహత్తర విలువలను బోధించి ఆచరణలో చూపిన యేసు క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలు లేని సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే సామాజిక సమరసత సాధ్యమవుతుందని తెలిపారు.తెలంగాణలో అన్ని మతాలకు సమాన గౌరవం, అన్ని పండుగలకు సమాన గుర్తింపు లభించాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు.దేవుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగా వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు.
క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు… ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

