గ్రేటర్ న్యూస్,గీసుగొండ : మండల కేంద్రంలో మామునూరు ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలపై ప్రజల్లో భరోసా కల్పించేలా ర్యాలీ చేపట్టారు.ఈ సందర్బంగా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమం లో గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్సై లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

