గ్రేటర్ న్యూస్, హనుమకొండ: దేశవ్యాప్తంగా విడుదలైన 2026 జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలలో వరంగల్ హనుమకొండలోని వైబ్రంట్ విద్యాసంస్థలు రికార్డు స్థాయి విజయాలను నమోదు చేశాయి. ఈ ఫలితాల్లో వైబ్రంట్ విద్యార్థి సచ్కల్స 99.99 పర్సంటైల్ సాధించి అగ్రస్థానంలో నిలవగా, డి. హేమంత్ 99.24 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజస్థాన్లోని కోటా విద్యా ప్రమాణాలను వరంగల్ మహానగరానికి పరిచయం చేయడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. కోటా డైరెక్టర్ల పర్యవేక్షణలో రూపొందించిన స్టడీ మెటీరియల్, సూక్ష్మ స్థాయి ప్రణాళికతో కూడిన ప్రాక్టీస్ పేపర్లు, నిష్ణాతులైన ఫ్యాకల్టీచే ప్రతి సబ్జెక్టులో సందేహ నివృత్తి తరగతులు, మెయిన్స్, అడ్వాన్స్డ్ స్థాయిల్లో క్రమం తప్పకుండా వీకెండ్ ఎగ్జామ్స్ నిర్వహించడం ప్లస్ పాయింట్ అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేందుకు ప్రత్యేకంగా యోగా, మెడిటేషన్
తరగతులు నిర్వహించడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరిగిందని,రెండేళ్ల కఠిన శిక్షణ నేడు వారిని ఉన్నత స్థాయికి చేర్చిందని రాజేందర్ రెడ్డి కొనియాడారు. ప్రతిభ చాటిన విద్యార్థుల్లో పెద్దపల్లి చరణ్ తేజ: 96.81, కొండమల్ల రామ్ చరణ్: 94.94, సోలేంక సిద్ధార్థ:
94.35, జ్ఞానశ్రీ: 93.46 పర్సంటైల్, వెల్దండి సాయిచంద్ర: 92.25 పర్సంటైజ్ సాధించారు. కాగా, సంస్థ నుంచి మొత్తం 48 మంది విద్యార్థులు 90.00 పర్సంటైల్ పైగా సాధించి జాతీయ స్థాయిలో వైబ్రంట్ సత్తాను చాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషుకుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

