25 Feb 2026, Wed

జేఈఈ మెయిన్స్ -2026 లో “షైన్ ” ప్రభంజనం…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ: జేఈఈ మెయిన్స్ -2026 ఫలితాలలో 95.23, 95.22 పర్సన్టైల్స్ సాధించి కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు అందజేయడం జరిగిందని షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, ఆరూరి కవిత, మూగుల రమేష్ సంయుక్తంగా తెలియజేశారు. సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2026 ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల జాతీయ స్థాయి ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుండి జేఈఈ మేయిన్స్, అడ్వాన్స్, నీట్ లలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్ లో అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన ఆణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పర్సన్టైల్ సాధించిన ఎమ్. ప్రశాంతి-95.23, ఎమ్. దీక్షిత-95.22, రూపశ్రీలక్ష్మి-94.51, ఆర్. సౌరభ్ వర్మ- 94.23 , కె.అభిలాష్ – 92.38 , వి.మాధురి-92.11, జి.సిద్దు – 92.09 విద్యార్థులను యాజమాన్యం అభినందించడం జరిగింది. వీరితో పాటుగా 28 మంది విద్యార్థులు 85.0 పర్సెన్టైల్ పైగా ఫలితాలు సాధించారని చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్తో మామూలు విద్యార్థులను కూడా మెరికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం వలనే ఈ విజయాలు సాధించారని వారు పేర్కొన్నారు. ఈ విజయాలకు తోడ్పడిన మా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమములలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఐఐటీ కో-ఆర్డినేటర్ మూగుల రమేష్ యాదవ్,కళాశాలల ప్రిన్సిపల్స్ మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ , ప్రశాంత్ , అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *