గ్రేటర్ న్యూస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 31 డివిజన్ హంటర్ రోడ్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన RIDESMART టూ వీలర్ సర్వీస్ సెంటర్ ను బుధవారం స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు,9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.కస్టమర్లను ఆకర్షించే విధంగా సర్వీస్ చేస్తూ అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమంలో షో రూమ్ యజమాని పొపేట జయారపు శిరీష,రవి,పూజిత,మణిదీప్, డివిజన్ నాయకులు వేల్పుల బిక్షపతి,నాగరబోయిన బాబురావు, తదితరులు పాల్గొన్నారు.


