గ్రేటర్ న్యూస్,హనుమకొండ : మెడికల్ విద్యలో ప్రతిభ కనబరచి ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని విద్యాశ్రీ కి తొలి సంవత్సరం పాఠ్యపుస్తకాలను హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు కాంగ్రెస్ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్బంగా విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…పేద కుటుంబాల నుంచి ఉన్నత విద్యలో ముందుకు సాగుతున్న విద్యార్థులకు అండగా నిలవడం నాయిని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని విష్ణు రెడ్డి తెలిపారు.విద్యాశ్రీ లాంటి ప్రతిభావంతులకి సహాయం చేస్తూ విద్యాభివృద్ధికి ట్రస్ట్ కొనసాగింపుగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

