గ్రేటర్ న్యూస్,పాలకుర్తి: పట్టణ కేంద్రంలో 6 వ వార్డు అభ్యర్థి పద్మశాలి ముద్దు బిడ్డ కామారపు సునీల్ అధిక ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సునిల్ కు ఘనంగా సత్కారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెనుగొండ రమేష్, రాష్ట్ర విద్యార్ధీ సంఘ అధ్యక్షుడు డాక్టర్ మేడారపు సుధాకర్, పోపా జనగాం జిల్లా సహాయ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య, పట్టణ సలహాదారులు కాటబత్తిని రమేష్, పట్టణ కార్యదర్శి చిలూకమారి సోమేశ్వర్,గౌరవ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వర్లు, ల్యాబ్ వెంకన్న, చిలుకమారి ఉప్పలయ్య, ఈగ శ్రీను లు తదితరులు పాల్గొన్నారు.

