గ్రేటర్ న్యూస్, ఆత్మకూరు : మండల పరిధిలోని గూడెప్పాడు గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఆత్మకూర్ సీఐ సంతోష్ తెలిపారు.గూడెప్పాడు గ్రామానికి చెందిన వంగర రాజీవ్ ఇంట్లో ‘మూడు ముక్కలాట’ (పేకాట) ఆడుతున్నారనే సమాచారం మేరకు మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట రాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.8,160 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో అంబటి రాజు, కందకట్ల అశోక్, బలభద్ర చిరంజీవి, ఎండీ హుస్సేన్ ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు.

