గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం :మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. రేపు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వహణ కోసం 1100 పైగా పోలీసులను వినియోగించడం జరుగుతోందని ఇందులో ముగ్గురు డిసిపిలతో పాటు ఐదుగురు అదనపు డిసిపిలు,4మంది ఏసిపిలు, 11మంది ఇన్స్‌స్పెక్టర్లు,125 మంది ఎస్.ఐలు,113 మంది, ఏ.ఎస్.ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు 515, హోంగార్డ్స్ 226 మంది వీరితో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ విభాగాలకు చెందిన సుమారు 168 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నిక వేళ అదనపు డిసిపి స్థాయి పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించడం జరిగిందని, ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపల్ పరిధిలో ఒక ఏసిపి స్థాయి అధికారిని ఇంచార్జ్‌గా వుంటారని. రూటు మొబైల్స్ టీంలు, షాడో పార్టీలు,ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్.ఐ/ఏ.ఎస్.ఐతో పాటు హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ పోలీస్ బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఎన్నిక వేళ ఎవరైన ఎన్నికలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇలాంటి చర్యలకు ఎవరైన పాల్పడుతున్నట్లుగా సమచారం అందితే తక్షణమే పోలీసులకు సమచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

