గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : మేడారం మహా జాతర 2026 పోస్టర్ను ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ (సీతక్క) , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

