అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి
హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్…
గ్రేటర్ న్యూస్,హనుమకొండ :మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ సూచించారు. ఈ సందర్బంగా బుధవారం ఇన్స్పెక్టర్ శివ కుమార్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ… మొంథా తుపాన్ నేపథ్యంలో చెరువులు మత్తడి పొసే అవకాశం, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, వాహన దారులు వాగులు మత్తడి దాటే ప్రయత్నం చేయకండని సూచించారు.రోడ్డుపై వెళ్ళేటప్పుడు డ్రైనేజీ లు,గుంతలు గమనించాలని తెలిపారు.ప్రజలు క్షేమంగా ఉండాలని పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని గుర్తు చేశారు .అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని లేకుంటే ఇళ్లల్లో ఉండాలని కోరారు. పిల్లలను బయటకు రాకుండా చూడాలని వర్షం పడేటప్పుడు ప్రజలు కరెంట్ స్తంభాలను తాకాకూడదని అన్నారు .మీ రక్షణ మా బాధ్యత అని అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని ఇన్స్పెక్టర్ శివ కుమార్ సూచించారు.

