25 Feb 2026, Wed

రాజీతో సమస్యలను పరిష్కరించుకోండి – వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్…

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం :ఈ నెల 21వ తేదీ ఆదివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ ఆదాలత్ సంబందించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ఈ నెల 21, ఆదివారం రోజున జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో

° క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,
° సివిల్ తగాదా కేసులు,
° ఆస్తి విభజన కేసులు,
° కుటుంబపరమైన కేసులు,
° వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,
° బ్యాంకు రికవరీ,
° విద్యుత్ చౌర్యం,
° చెక్ బౌన్స్

మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుందని రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు, ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం వరంగల్ ఏ.ఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్ స్పెక్టర్లు రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *