గ్రేటర్ న్యూస్, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటిసి) ఎలక్షన్ కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల చేసి జనవరి లో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

