పీ.ఆర్, ఆర్&బి రోడ్లకు వారం రోజుల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలి…..
ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు కూడా పంట నష్టపరిహారం అందజేయాలి….
పశువులు కోల్పోయిన వారికీ, ఇల్లు కోల్పోయిన వారికీ వెంటనే నష్ట పరిహారం అందజేయాలి…..
ఇండ్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి….
గ్రేటర్ న్యూస్, హనుమకొండ :పంట నష్టం అంచనాలో అధికారులు నిబంధనలు పక్కన పెట్టి రైతులకు అనుకూలంగా వ్యవహరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.మంగళవారం హన్మకొండలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాల మీద శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో భారీ వర్షాలతో వివిధ పంటలు, పశు సంపద , రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్న వివరాలను, ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు, పంట నష్ట వివరాల నమోదు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులు ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.
ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన సర్వేను త్వరగా పూర్తిచేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారీ వర్షాలతో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉన్నందున ధర్మసాగర్ రిజర్వయర్ గేట్స్ ఎత్తాలాన్నారు. భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు ఉన్నందున సాగునీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. క్లౌడ్ బరస్ట్ వరంగల్ లోనే చూపిస్తున్నందున రిజర్వాయర్ గేట్స్ నుండి నీటి విడుదల చేయాలన్నారు. పంటల నష్టం వివరాలను రైతులకు ఇబ్బందులు కలగకుండా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని, నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా లిబరల్ గా పంట నష్ట వివరాలు నమోదు చేయాలనితెలిపారు. పలు గ్రామాలలో రైతులు ఆరబోసిన ధాన్యము కొట్టుకుపోయిందని, అలాగే తడిసిన ధాన్యము ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు ఉన్నందున వెంటనే కొనుగోలు చేయాలని డీఆర్డీవొ మేన శ్రీను ను ఆదేశించారు. పశు సంపద నష్టపోయిన వారిని వెంటనే ఆదుకునేందుకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. రెండు మండలాల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అర్హతల మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని, వెంటనే ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. పంట నష్టం సర్వే మూడు రోజుల్లో పూర్తి చేయాలని, ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు పంట నష్టం కింద పరిహారం అందించేందుకు వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా వ్యవసాయ అధికారులు సర్వే చేయాలన్నారు.
ధర్మసాగర్, వేలేరు మండలాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ చర్యలలో భాగంగా మరమ్మతులు చెప్పటాలన్నారు. రోడ్ల పై ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఉనికిచర్ల నుండి రాపాకపల్లి వరకూ రోడ్డు బాగా లేదని దాన్ని బాగు చేయాలన్నారు. ప్రతిసారి సమస్య ఎదురవుతున్న పరిస్థితుల కారణంగా దేవునూరు లో లెవెల్ కాజ్ ను హై లెవెల్ కాజ్ గా చేస్తే ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. వాగు కు హద్దులు నిర్ణయించివెడల్పు చేయాలని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను వారం రోజుల్లో తాత్కాలిక పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వేలేరు -కొత్తకొండ ల మధ్య ఉన్న రోడ్డు ను స్ట్రెంతేనింగ్, వైడెనింగ్ చేయడం తో పాటు కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనాలు సిద్ధం చేయాలని పీఆర్ అధికారులకు సూచించారు. వేలేరు పాఠశాల సమీపంలో ఉన్న డ్రైనేజీ సమస్య ను పరిష్కరించాలన్నారు. అధికారులు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. పని చేసే అధికారులను గౌరవిస్తానని, పేద ప్రజల పట్ల బాధ్యత గా పనిచేసే అధికారులు అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ..
పంటలు, రోడ్లు, పశు సంపద నష్టం పై సంబంధిత శాఖల అధికారులు అంచనాలను త్వరగా అందజేయాలన్నారు. పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కు ప్రతిపాదనలు అధికారులు అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్డిఓ మేన శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారాం, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ధర్మ సాగర్, వేలేరు తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీవోలు అనిల్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి, సాగునీటిపారుదల, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

