25 Feb 2026, Wed

వరదల వల్ల నష్టపోయిన పంట, ఆస్తి వివరాలు త్వరగా నమోదు చేసి సమర్పించాలి… వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరదల వల్ల నష్టపోయిన పంట, ఆస్తి వివరాలు త్వరగా నమోదు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇటీవల జరిగిన భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా వాటిల్లిన నష్టంపై వివరాల నమోదు పురోగతి, పునరుద్దరణ కు చేపట్టాల్సిన తాత్కాలిక, శాశ్వత పనులు, రూపొందించాల్సిన జిల్లా, మండలాల సమగ్ర ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ… ఇటీవల జరిగిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాల వివరాలను వెంటనే నమోదు చేసి సమర్పించాలని అన్నారు.పునరుద్దరణకు తాత్కాలిక, శాశ్వత మరమ్మతు పనుల వివరాలను రెండు రోజుల్లోపు సమర్పించాలన్నారు. అలాగే భవిష్యత్తులో ముంపు సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వానికి సమర్పించుటకు జిల్లా, మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ లు సుమా, ఉమారాణి, వ్యవసాయ, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, విద్యుత్, రెవెన్యూ, మునిసిపల్, పశు సంవర్థక, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *