గ్రేటర్ న్యూస్, హనుమకొండ :బాలసముద్రం లోని షైన్ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన షైన్ స్కాలర్షిప్ టెస్ట్ కు విశేష స్పందన లభించిందని కళాశాల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్ టెస్ట్ కు సుమారు 1500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.షైన్ కళాశాల ప్రారంభం నుంచే ఎందరో విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామి విద్యాసంస్థలుగా పేరొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్లు మూగుల రమ, ఎ.కవిత, మూగుల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాల్ మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ప్రశాంత్,మార్కెటింగ్ ఇన్చార్జి రాజేందర్, బుచ్చిరెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

