గ్రేటర్ న్యూస్,వరంగల్ : చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.దీంతో స్థానికులు,పలువురు జయరాజ్ ను అభినందించారు.

