25 Feb 2026, Wed

హనుమకొండలో దారుణం…. ఏకంగా కత్తులతో దాడికి దిగిన కార్పొరేటర్

గ్రేటర్ న్యూస్, హనుమకొండ :హనుమకొండలోని దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కత్తులతో దాడికి దిగిన 04 డివిజన్ కార్పొరేటర్…బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రేటర్ వరంగల్ పరిధిలోని గత కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు రఘు అతని తమ్ముడు లక్ష్మణ్ లు కీలక పాత్ర పోషించారు.దీంతో నిన్నటి రోజు శనివారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి యాదవ్ నగర్ లో పర్యటించగా ఎమ్మెల్యే వెంట తిరగడంతో అది జీర్ణించుకోలేని స్థానిక నాల్గవ డివిజన్ కార్పొరేటర్  రఘు పై ఏకంగా కత్తులతో దాడి చేస్తుండగా తమ్ముడు లక్ష్మణ్ ఆపడంతో చేయికి గాయమైందని రఘు తెలిపారు. దీంతో అతన్ని స్థానికులు వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా  కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *