ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్…

గ్రేటర్ న్యూస్,హనుమకొండ క్రైం :శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలిపారు.వరంగల్ మెడికవర్ హాస్పటల్ సహకారంతో వరంగల్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమీషనర్ శుక్రవారం ప్రారంభించారు. నిరంతరం విధి నిర్వహణకై అంకితమైన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ విభాగాలకు చెందిన వైద్య నిపుణులచే ఈ శిబిరానికి తరలి వచ్చిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేపట్టడంతో పాటు వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి BMD టెస్ట్ (బోన్ మినరల్ డెన్సిటీ),లిపిడ్ ప్రొఫైల్), ECG (ఎలక్ట్రోకార్డియోగ్రామ్),2D ఈకో, LFT టెస్ట్ (లివర్ ఫంక్షన్ టెస్ట్),GRBS (రాండమ్ బ్లడ్ షుగర్),CBP (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)లాంటి వైద్య నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యంగా వున్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని, ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు ఆరోగ్య పరీక్షలకై సమయాన్ని కేటాయించాలని రెండు రోజుల పాటు నిర్వహించబడే ఈ శిబిరాన్ని పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మెడికవర్ యాజమాన్యం తో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు, సిబ్బంది కి పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా హన్మకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ నుండి సుమారు 5 లక్షల విలువైన మందులను అందచేశారు…
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అదనపు డిసిపిలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాల స్వామితో పాటు వైద్య ఆరోగ్య అధికారి అప్పయ్య,ఆర్. ఐ లు, ,మెడికవర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *