గ్రేటర్ న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన డాక్టర్ శభారీష్ ఐపీఎస్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఎస్పీగా పనిచేస్తున్న ఆయనను మహబూబాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన డా. శభారీష్‌ను, బదిలీపై వెళ్లుతున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పరిధిలోని అధికారులతో సమావేశమై పలు సూచనలు ఇచ్చారు.

