సైకిల్‌ రైడర్స్‌లో జోష్‌ నింపిన సీపీ

గ్రేటర్ న్యూస్,వరంగల్ క్రైం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తో పాటు, యువత, విద్యార్థులు, చిన్నారులు, వృద్దులు, పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఈ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్, ఎన్.డి.పి సి.ఎల్ సియండి వరుణ్ రెడ్డి, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ పాల్గొన్న ఈ ర్యాలీ కి అదనపు డిసిపిలు రవి, సురేష్ కుమార్ పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి అంబేద్కర్ సెంటర్, ఆదాలత్ సెంటర్, హన్మకొండ కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి ఇదే మార్గం నుండి నక్కలగుట్ట మీదగా పొలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయమునకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైకిలింగ్‌ రైడర్స్‌తో కలసి పోలీస్‌ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తు రైడర్స్‌ ను ఉత్సహపర్చారు. అనంతరం ఈ సైకిల్‌ ర్యాలీ పాల్గోన్న సైకిల్‌ రైడర్లకు పోలీస్‌ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రధానం చేసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి రోజు సైకిలింగ్‌ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా వుండటంతో పాటు, రోజంతా ఉత్సహంగా తమ విధుల్లో రాణించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు సైకిలింగ్‌ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం కావవ్చని, అలాగే పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గోన్న ప్రతి ఒక్కరికి పోలీస్‌ అమరవీరుల కుటుంబాలతో పాటు, పోలీసుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్, ఎన్.డి.పి సి.ఎల్ సియండి మాట్లాడుతూ నిత్యం సైకిలింగ్ చేయడం మన ఆరోగ్యాన్ని పరి రక్షించుకోవచ్చని, సైకిలింగ్ చేయడం రోజు వారి అలవాటుగా మార్చు కోవాలని తెలిపారు.
ఈ ర్యాలీలో అదనపు డిసిపి లు, శ్రీనివాస్, ప్రభాకర్, బాలస్వామి, ఏ ఎస్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, నర్సింహా రావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఏ.జే పెడల్స్‌ యాజమాన్యం, ట్రైసిటి సైకిల్‌ రైడర్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, నిట్‌ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *