గ్రేటర్ న్యూస్,హనుమకొండ:ఈ నెల 30 తేదీన వైంబ్రంట్ అకాడమీ (కోటా రాజస్థాన్)హనుమకొండ నక్కల గుట్ట బ్రాంచ్ లోని స్కాలర్షిప్ కమ్ ఎర్లీ అడ్మిషన్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుందని 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు వారి యొక్క సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ యొక్క టెస్ట్ ను నిర్వహిస్తున్నామని అకాడమీ డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం హనుమకొండ నక్కల గుట్ట వైబ్రంట్ అకాడమీ లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అగ్రగామి విద్యాసంస్థ అయిన వైబ్రంట్ అకాడమిలో వేల సంఖ్యలో ఐఐటి, నీట్ సీట్లను సాధించడం జరిగినదని కావున అదే స్పూర్థితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నిరూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి అధిక సంఖ్యలో పాల్గోనగలరని సూచించారు. ఇట్టి పరీక్షలో ఉత్తీర్ణత కనబరచిన మొదటి ఐదుగురు విద్యార్థిని, విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తి ఉచితం కల్పించడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.మిగతా ప్రతిభ కనబరచిన విద్యార్ధిని, విద్యార్థులకు మార్కుల ఆధారంగా ట్యూషన్ ఫీజులో కొంత రాయితీ ఇవ్వడానికి నిర్ణయించడమైనదని అన్నారు.అదేవిదంగా ప్రతి స్కూల్లో జరిగిన స్కాలర్షిప్ టెస్ట్లో ప్రతిభ కనబరచిన మొదటి ముగ్గురు విద్యార్థిని, విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం టెస్ట్ కు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు .ఈ కార్యక్రమంలో అకాడమి ప్రిన్సిపాల్ శేషుకుమార్ , అకాడమిక్ హెడ్ రామక్రిష్ణ, ఏ జి ఎం ఎస్ గుండాల రాజు, మాలోత్ నారాయణసింగ్, దండు రాజు,కోఆర్డినేటర్ రాము, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.

