వరద బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తున్నాం… ఎమ్మెల్యే నాయిని…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ఇటీవల కురిసిన  అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలలో భాగంగా హనుమకొండ, కాజీపేట మండలలో సంబదించిన వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన రేషన్ ని శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  , నగర మేయర్  గుండు సుధారాణి,చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు.రెండు మండలాలకు గాను మొత్తం 57 వ డివిజన్ వాజ్ పేయ్ కాలనీలో, 49 డివిజన్ లోటస్ కాలనీల్లో పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో నగరంలో చాలా చోట్ల ఆర్ధిక నష్టం వాటిల్లిందని వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను మరుసటి రోజే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, సంబధిత మంత్రులు, అధికారులు పర్యటన చేసి జరిగిన నష్టాన్ని అంచనావేసి వరద సహాయం కింద రూ 15000 ప్రకటించారని గుర్తు చేశారు.బాదిత కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాల నెంబర్లు తప్పుగా ఇవ్వడం కారణంగా ఆలస్యం అయిందని ఒక్కొక్కటిగా బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ సోమవారం నాటికి పూర్తి అవుతుందని తెలిపారు.2440 మందికి నష్ట పరిహారంగా రూ.3.76 కోట్లు రూపాయలను 504 క్వింటాళ్ల రేషన్ బియ్యం అందించామని తెలిపారు.గతంలో వరదలు వస్తే పోటోలకు పోస్ ఇచ్చిన పరిస్థితులే తప్ప ఒక్క రూపాయి అందించిన దాఖలాలు లేవని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ వి శ్రీనివాస్ రావు,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,ఆర్ టి ఏ మెంబెర్ పల్లకొండ సతీష్,కార్పొరేటర్ మానస రాంప్రసాద్,బంక సరళ సంపత్ యాదవ్ ఆయా డివిజన్ ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *