గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మేడారం పనుల నాణ్యత లో ఏమాత్రం రాజీ పడొద్దని సూచించారు . నిర్మాణంలో చిన్న విమర్శకు కూడా తావు ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు . గద్దెల సమీపం లో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు . గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, వైభవం ఉట్టిపడేలా లైటింగ్ ఉండాలని ఆదేశించారు . గుడి చుట్టు పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు .
ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

