హైదరాబాద్ ధర్నా కు బయలుదేరిన జర్నలిస్టు నాయకులు…

గ్రేటర్ న్యూస్,హనుమకొండ టౌన్ : జర్నలిస్టుల సమస్యల సాధనకు టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మహా ధర్నాకు బుధవారం హనుమకొండ జిల్లా నుండి భారీగా జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఉదయం 7 గంటలకు హనుమకొండ హరిత కాకతీయ హోటల్ నుండి బయలుదేరి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కార్యాలయంకు తరలి వెళ్లి ధర్నా లో పాల్గొననున్నారు. జిల్లా నుండి తరలి వెళ్లిన వారిలో టీయుడబ్ల్యూజె (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్,వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్,కంకనాల సంతోష్, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య,కోశాధికారి బోళ్ల అమర్, యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి,నార్లగిరి యాదగిరి డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్,సిహెచ్ సోమనర్సయ్య, ఎం. రాజేంద్ర ప్రసాద్, సాయిరాం,వలిశెట్టి సుధాకర్,కె.దుర్గా ప్రసాద్, ఎండి నయీం పాషా,శ్రీహరి రాజు, బి. విజయ్ రాజ్,యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *