గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందని ప్రజల్లో భరోసా కలిగించాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులకు సూచించారు. మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ ప్రాంగణాన్ని సీపీ బుధవారం ప్రారంభించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీపీ పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమీషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖకు గౌరవమర్యాదలు తీసుకవచ్చే విధంగా అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని, రౌడీ షీటర్ల పట్ల మేతక ధోరణితో వ్యవహరించవద్దని ఫిర్యాదులు వచ్చిన తక్షణమే స్పందించాలని నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని సీపీ అధికారులు, సిబ్బందికి సూచించారు. తదనంతరం సీపీ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి కవిత, ఏ. ఎస్పీ శుభం ప్రకాష్, ఇన్స్ స్పెక్టర్ రమేష్ తో పాటు ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




