గ్రేటర్ న్యూస్,వరంగల్: శ్రీ భద్రకాళీ దేవస్థానంలో బుకింగ్ కౌంటరులో విధులు నిర్వహిస్తున్న ఎస్. నరేందర్, పి. శరత్ కుమార్ పైన డూప్లికేట్ టికెట్లు విక్రయించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిర్ధారణ అయినందున వారిని వారి బాధ్యతల నుండి మంగళవారం
ఉద్యోగము నుండి సస్పెండ్ చేయుట జరిగినదని ఆలయ ఈ ఓ (కార్యనిర్వహణాధికారి) రామల సునీత తెలిపారు.ఈ సందర్బంగా ఈ ఓ సునీత మాట్లాడుతూ దేవాలయ అర్చకులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని వారితో మర్యాద పూర్వకముగా వ్యవహరించాలని ఆదేశించారు .పార్కింగ్ స్థలములో చెప్పుల స్టాండు దగ్గర బోర్డులు ఏర్పాటు చేయుట జరిగినదని ఎవరైనా డబ్బులు అడిగినచో మా దృష్టికి తీసుకురావాలని ఈ ఓ తెలిపారు. పూజా కార్యక్రమముల అనంతరం భక్తులు నచ్చితే తోచిన సంభావణ మాత్రమే ఇవ్వగలరని , ఎవరైనా డిమాండ్ చేసినచో దేవస్థాన కార్యాలయము నందు ఫిర్యాదు చేయాలని అర్చకులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటానని కార్యనిర్వహణాధికారి రామల సునీత తెలిపారు.

