గ్రేటర్ న్యూస్, కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 103 పెండింగ్ చలాన్ లు ఉన్న వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసారు. కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో ఎస్సై కనక చంద్రం, ఎస్సె సంపత్ శుక్రవారం కాజీపేట చర్చి వద్ద వెహికల్స్ చెక్ చేయగా బైక్ పై 103 పెండింగ్ చలాన్ ఉన్న వాహనాన్ని గుర్తించారు. 25105/- రూపాయల ఫైన్ ఉండగా…. పోలీసులు వెహికల్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

