గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : మూడవ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం దామెర, ఆత్మకూర్, శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బ్యాలెట్ పత్రాలను తరలించేటప్పుడు అలాగే రేపు జరిగే మూడవ విడత ఎన్నికల వేళ ముందస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, ఎన్నికల సిబ్బందికి సీపీ కీలక సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ వెంట అదనపు డీసీపీ బాల స్వామి,ఏ. ఎస్పీ శుభం, ఏసీపీ లు సతీష్ బాబు, సత్యనారాయణ తో పాటు స్థానిక ఎస్. ఐలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐలు పాల్గొన్నారు.



