వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
గ్రేటర్ న్యూస్,వరంగల్ : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు.మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గల 27, 32, 35, 37, 38, 41వ డివిజన్లలో మంత్రి కొండా సురేఖ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకటించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ … గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి సురేఖ తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదల సమస్యలు మానవత దృక్పథంతో అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమం జోడొద్దుల్లా ముందుకు తీసుకెళుతున్నారని మంత్రి సురేఖ తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను నేరుగా పరిశీలించి, పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తో పాటు GWMC మేయర్ గుండు సుధారాణి , GWMC కమిషనర్, KUDA ఛైర్మెన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







