గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : వాట్సాప్ యూజర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. “హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండని సూచించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్ అని చెప్పారు. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అయ్యి, యూజర్ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు .

