పటిష్ట కార్యచరణ తో వరద ముంపు నివారణ చర్యలు: : జిల్లా కలెక్టర్ డా.సత్య శారద…


▪️ బల్దియా వరంగల్ మున్సిపాల్ కమిషనర్ తో కలిసి ముంపు ప్రాంతాల్లో సందర్శన….

గ్రేటర్ న్యూస్,వరంగల్ :పటిష్ట కార్యచరణ తో వరద ముంపు నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు.గురువారం వరంగల్ నగరంలోని ప్రాంతంలోని వరద ముంపు కు ప్రభావితమైన చిన్న వడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మి గణపతి కాలనీ, ఎల్బీనగర్ లోని అంబెడ్కర్ నగర్, ప్రాంతాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్, రెవిన్యూ, మునిసిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక డ్రెయినేజీ వ్యవస్థలను సమీక్షించి, నీటి ప్రవాహ మార్గాలను సరిచేసే చర్యలు తక్షణం చేపట్టాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ ప్రజల సమస్యలను నేరుగా విని, త్వరితగతిన ఉపశమన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి కార్పొరేటర్ సురేష్ జోషి, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఎం హెచ్ ఓ డా.రాజేష్ ఇరిగేషన్ ఈ ఈ కిరణ్ బల్దియా ఈ ఈ సంతోష్ బాబుడి ఈ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *