గ్రేటర్ న్యూస్, వరంగల్ : జపాన్ లో జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్-2026కు వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ మణికంఠ గడదాసు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డబ్ల్యూఎఫ్ఎస్ కేఓ ఇండియా అధ్యక్షుడు హసన్ ఇస్మాయిల్, తెలంగాణ అధ్యక్షుడు వి. చంద్రశేఖర్ గురువారం ప్రకటించారు. జూలై 4, 5 తేదీల్లో జపాన్ లో నకగావా నగరంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.ఈ సందర్బంగా మణికంఠ ను పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

