Breaking
1 Jun 2026, Mon

భద్రకాళీ అమ్మవారికి లక్ష తెలుపు చామంతి పూలతో పుష్పార్చన…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఏడవ రోజు కార్యక్రమాలలో  భాగంగా బుధవారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జపహెూమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష తెలుపు చామంతి పూలతో పుష్పార్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *