గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ పోలీస్ కమీషనర్‌గా ఎన్.శ్వేత రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కమీషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బుధవారం నూతన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమీషనర్‌కు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కమీషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

