గ్రేటర్ న్యూస్,హనుమకొండ :ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన వెన్నెముక వైకల్యాలను నివారించవచ్చని సోమాజిగూడ యశోద హాస్పిటల్ స్పెషలిస్ట్ స్పైన్ సర్జన్, డాక్టర్ యార్లగడ్డ మధుకిరణ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మధు కిరణ్ మాట్లాడుతూ… స్కోలియోసిస్ అనేది కేవలం కూర్చునే లేదా నిలబడే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సమస్య కాదని ఇది వెన్నెముక నిర్మాణానికి సంబంధించిన సమస్య అని దీనికి సరైన సమయంలో పరీక్షలు అవసరమని తెలిపారు . సంతోషకరమైన విషయం ఏమిటంటే, దీన్ని ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే చాలా మంది పేషెంట్స్ పెద్ద సర్జరీల దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదని సూచించారు.పిల్లల భుజాలు, నడుము లేదా వీపు భాగంలో ఏవైనా అసమానతలు కనిపిస్తే తల్లిదండ్రులు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు.ముందుగానే గుర్తించడం, నిపుణుల మార్గదర్శకత్వం సరైన చికిత్స తీసుకోవడం ద్వారా పిల్లలుపెద్దలుచురుకైన,ఆరోగ్యకరమైనఆత్మవిశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ రూపేష్ షిండే, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన వెన్నెముక వైకల్యాలను నివారించవచ్చు…డాక్టర్ యార్లగడ్డ మధుకిరణ్

