Breaking
16 Jul 2026, Thu

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తేజావత్ వెంకన్న..

ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ..!!

గ్రేటర్ న్యూస్, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న తేజావత్ వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది.ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నూతన కమిషనర్ గా వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *