గ్రేటర్ న్యూస్,ములుగు: జిల్లాలోని తాడ్వాయి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి.
మేడారంలోని ‘పూజారుల (వడ్డెలు) సంఘం’ సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క కు లేఖ ద్వారా వివరాలను తెలియజేశారు.
మినీ జాతర తేదీల వివరాలు (2027):
• 17.02.2027 (బుధవారం)
- 18.02.2027 (గురువారం)
- 19.02.2027 (శుక్రవారం)
- 20.02.2027 (శనివారం)
పైన తెలిపిన నాలుగు రోజులు అమ్మవార్ల జాతర అమ్మవారి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పూజారుల సంఘం నాయకులు మరియు వడ్డెలు ఈ వివరాలను దృవీకరిస్తూ లేఖపై సంతకాలు చేశారు.

