ఉద్యోగ సేవా రంగంలో ఊకంటి మహేందర్ కు జాతీయ పురస్కారం…

గ్రేటర్ న్యూస్,వరంగల్ : ఉద్యోగ సేవా రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఊకంటి మహేందర్, పోస్ట్‌మాస్టర్, జమ్మికుంట, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కి జాతీయ స్థాయి పురస్కారం – 2026 లభించడం అభినందనీయమని తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు.ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సేవా ప్రయోజనాల పరిరక్షణతో పాటు తపాలా శాఖ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉద్యోగ సేవా రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, సహచర ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం–తెలుగు వెలుగు సాహితీ వేదిక 2026 సందర్భంగా 27-09-2026న ఆదివారం వరంగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ ప్రతినిధులు, సహచర ఉద్యోగులు, శ్రేయోభిలాషులు యు. మహేందర్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం మరియు తపాలా సేవల అభివృద్ధికి మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు.“ఉద్యోగ సేవలో అంకితభావం – సమాజ సేవలో స్ఫూర్తి” అనే నినాదంతో ఆయనకు ఈ జాతీయ పురస్కారం అందుకోవడం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *