Breaking
22 Aug 2026, Sat

వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక….

నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత …

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్యల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ ఎన్నికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 110 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి. బాబుపై 17 ఓట్ల ఆధిక్యంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా బి. సతీష్ (ఆర్‌ఐ), బి. శరత్ కుమార్ (ఆర్‌ఎస్‌ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు (దామెర ఎస్‌ఐ), సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్ కుమార్ (ఏఆర్ కానిస్టేబుల్), కోశాధికారిగా బి. నరేష్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.

కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి (మహిళా కానిస్టేబుల్, కాజీపేట), సి.హెచ్. మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఏ. రమేష్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్. ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎం.డి. తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి. సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *