Breaking
22 Aug 2026, Sat

మాజీ మంత్రి రెడ్యా నాయక్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం..

గ్రేటర్ న్యూస్, మహబూబాబాద్ : మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో రైస్‌మిల్లుకు వెళ్లే రహదారిపై ఈరోజు మాజీమంత్రి రెడ్యానాయక్‌ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు కారు డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మదించారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొనడంతో రెడ్యా నాయక్‌ కారు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్‌ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్యా నాయక్‌ను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *