గ్రేటర్ న్యూస్, హనుమకొండ: అథ్లెటిక్స్, కరాటేలో కేంబ్రిడ్జి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం జే ఎన్ ఎస్ స్టేడియంలో నిర్వహించిన అండర్–8 ఇయర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పరుగు పందాల్లో కేంబ్రిడ్జి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ స్టేట్ సెక్రటరీ సారంగపాణి , రామప్ప అకాడమీ చైర్మన్ ఐలి చంద్రమోహన్ గౌడ్ , స్కూల్ ఇన్‌చార్జ్‌లు ప్రవళిక, దివ్య, హెప్సిబా, కోచ్ సతీష్ పాల్గొన్నారు.
వర్థన్నపేట ఇల్లందులో నిర్వహించిన 3వ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్‌షిప్–2026లో కేంబ్రిడ్జి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఛాంపియన్స్‌గా నిలిచి అందరి అభినందనలు పొందారు. ఫస్ట్, సెకండ్ కతాల్లో విరాట్, నవిష్కా, శ్రీలీనా, అడ్విక్, శ్రీ శాన్వి, సమన్విత, ఆముక్తా లు గోల్డ్ మెడల్స్ సాధించి స్కూల్‌కు మంచి పేరు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ వంశీకృష్ణ ఐలి మాట్లాడుతూ…
“విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులు రాణించాలి అనే లక్ష్యంతో కేంబ్రిడ్జి మాంటిస్సోరీ స్కూల్ ముందుకు సాగుతోందన్నారు.విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ఉపాధ్యాయులు, కోచ్‌ల కృషి అభినందనీయం అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ 3వ డాన్ మౌనిక మాస్టర్, స్కూల్ ఉపాధ్యాయులు హారిక లక్ష్మి, రమ్య, కావ్య, ఆశిష్, వివిధ స్కూల్ల విద్యార్థులు పాల్గొన్నారు.


