Breaking
30 Aug 2026, Sun

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గా సిద్దోజు రమేష్

గ్రేటర్ న్యూస్,హనుమకొండ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిధిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గా సిద్దోజు రమేష్ ను నియమిస్తూ ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు .ఈ సందర్బంగా సిద్దోజు రమేష్ మాట్లాడుతూ…  నన్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమించినందుకు ఆర్, కృష్ణయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నా యొక్క నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *