Breaking
26 Mar 2026, Thu

ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు…

గ్రేటర్ న్యూస్,వర్ధన్నపేట :వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఇంకా ఎలాంటి సదుపాయాలు అవసరమో అడిగి తెలుసుకుని, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.పాఠశాలలో భోజనం, వసతి, తరగతి గదులు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించి, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *