గ్రేటర్ న్యూస్, వరంగల్ : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నగర, జిల్లా ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆరంభాలకు నాంది పలికే పవిత్రమైన సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ చట్టాలను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ, శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. యువత మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా సీపీ ఆకాంక్షించారు.

