గ్రేటర్ న్యూస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చైర్మన్ గా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమైన సందర్భంగా సోమవారం ఎర్రబెల్లి స్వర్ణను హనుమకొండ లోని వారి స్వగృహంలో హనుమకొండ, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు బంక సరళ, కే. పార్వతమ్మ ఆధ్వర్యంలో నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు & జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

